Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంని కలవాలంటున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు.. లెటర్ వైరల్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కావాలంటున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్లు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు. (Pawan Kalyan)
AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : తెలుగు సినీ పరిశ్రమ అనేక ఇబ్బందుల్లో ఉంది. జనాలు థియేటర్స్ కి కూడా రావట్లేదు. ప్రొడక్షన్ ఖర్చులు, రెమ్యునరేషన్స్ పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో పర్సెంటేజ్ విధానంలో అయితేనే సినిమాలు రిలీజ్ చేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు. ఇలా ఒకదానివెంట ఒకటి పలు సమస్యలు టాలీవుడ్ లో భారంగా మారాయి.
ఇప్పటికే ఫిలిం ఛాంబర్, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఇటీవలే తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. అయితే తెలంగాణలో థియేటర్ల సమస్యలపై మాట్లాడటానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కావాలంటున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్లు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు. తాజాగా పలువురు తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ కి లెటర్ రాసారు.
Also See : Karuunaa Bhushan : చీరకట్టులో సీరియల్ స్టార్ కరుణ భూషణ్ కవ్వింపులు..
ఈ లెటర్ లో.. ప్రస్తుత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి మాకుసమయం ఇవ్వాలని, మా తరపున తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్.. పలువురు వచ్చి కలుస్తామని, ఇండస్ట్రీ, థియేటర్స్ సమస్యలు తెలియచేస్తామని తెలిపారు.
దీంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ని కలుస్తామని లెటర్ రాయడంతో ఈ లెటర్ వైరల్ గా మారింది. మరి సినిమా పరిశ్రమ నుంచి ఎవరు వెళ్లినా స్పందించే పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Also See : NTR : తాతయ్య ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్.. ఫొటోలు..
