నటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు

  • Published By: sekhar ,Published On : July 23, 2020 / 12:09 PM IST
నటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు

Updated On : July 23, 2020 / 12:19 PM IST

సినీ నటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఒకరు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఈమెపై పలు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఇంటర్వూలలో రాధ ప్రశాంతి కొందరిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బయటికి వచ్చి చూడగా… రాధ ప్రశాంతి, ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తి కలిసి ఆ మహిళపై దాడి చేస్తుండగా తన మొబైల్‌లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మొబైల్ లాక్కొని ధ్వంసం చేసి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తే చేపడాతామని తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Radha Prasanthi