సి.సి.సి. సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

కరోనా ఎఫెక్ట్ : క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

  • Published By: sekhar ,Published On : March 29, 2020 / 08:12 AM IST
సి.సి.సి. సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

Updated On : March 29, 2020 / 8:12 AM IST

కరోనా ఎఫెక్ట్ : క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు.

కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో  సి. సి. సి. (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

నాగార్జున కోటి రూపాయలు, నాగ చైతన్య 25 లక్షలు, తారక్ 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు, కార్తికేయ 2 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళం ప్రకటించగా.. రవితేజ 20 లక్షలు, శర్వానంద్ 15 ల‌క్ష‌లు, వరుణ్ తేజ్ 20 లక్షలు, సాయిధరమ్ తేజ్ 10 లక్షలు, విశ్వక్ సేన్ 5 లక్షల విరాళం ప్రకటించారు. వీరిని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.