కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలో తారా లోకం

ప్రముఖ దర్శకులు.. కోడి రామకృష్ణ గారి రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం.. సి.హెచ్. మహేష్‌తో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 07:51 AM IST
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలో తారా లోకం

Updated On : May 28, 2020 / 4:00 PM IST

ప్రముఖ దర్శకులు.. కోడి రామకృష్ణ గారి రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం.. సి.హెచ్. మహేష్‌తో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

ప్రముఖ దర్శకులు.. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన స్వర్గీయ.. కోడి రామకృష్ణ గారి రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం.. సి.హెచ్. మహేష్‌తో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
 హోటల్ పార్క్ హయత్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి, కాబోయే వధు వరులను ఆశీర్వదించారు.

Read Also : శాతకర్ణి – సైరా సరదా సంభాషణ : టు స్టార్స్ ఇన్ వన్ ఫ్రేమ్!

మురళీ మోహన్, జీవిత, రాజశేఖర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, పరుచూరి గోపాలకృష్ణ, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ తదితరులు కుటుంబ సమేతంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియచేశారు. గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.