బాలుకి నివాళి..

Celebrities Tribute to SPB: అందరికీ శెలవంటూ గాన గంధర్వుడు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో పాటకు వన్నె తెచ్చి, ప్రేక్షకాభిమానులను సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన ఎస్పీ బాలు అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. సినీ పరిశ్రమ ఇంకా బాలు మరణవార్తను జీర్ణించుకోలేకపోతోంది.
సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలు, వీడియోలు షేర్ చేస్తూ పలు భాషలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులంతా బాలుకు నివాళులర్పిస్తున్నారు. జైపూర్ లో షూటింగులో ఉన్న రాజేంద్రప్రసాద్, రాధిక, తాప్సీ, విజయ్ సేతుపతి తదితరులు లొకేషన్ లో బాలు మృతికి సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు.
శనివారం బాలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు.