OTT Censor : ఓటీటీ సంస్థలతో కేంద్రమంత్రి సమావేశం.. తీరు మార్చుకోకపోతే సెన్సార్ తెస్తామని వార్నింగ్..

సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టడంతో పలువురు ఎంపీలు ఓటీటీకి సెన్సార్ గురించి కూడా అడిగారు.

OTT Censor : ఓటీటీ సంస్థలతో కేంద్రమంత్రి సమావేశం.. తీరు మార్చుకోకపోతే సెన్సార్ తెస్తామని వార్నింగ్..

Central Minister Anurag Thakur comments on Censor for OTT Contents

OTT Censor :  ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కొత్త బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారు. తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే ఈ బిల్ ప్రవేశపెడుతున్న సమయంలోనే పలువురు ఎంపీలు ఓటీటీలో వస్తున్న బోల్డ్, వల్గర్ కంటెంట్ గురించి కూడా కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కరోనా తర్వాత ఓటీటీకి బాగా డిమాండ్ పెరగడంతో అన్ని ఓటీటీ సంస్థలు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తెస్తుంది. ఈ నేపథ్యంలో బోల్డ్, వల్గర్ కంటెంట్ ని కూడా పెంచేస్తున్నారు ఓటీటీ సంస్థలు. సినిమా, సిరీస్ కథల్లో అవసరం లేకపోయినా ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి బూతులు, శృంగార సన్నివేశాలు.. లాంటి వల్గర్ కంటెంట్ ని పెడుతున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అనేకమంది ప్రముఖులు, ప్రేక్షకులు ఓటీటీకి సెన్సార్ లేకపోవడం వల్లే ఇష్టమొచ్చిన కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్నారని, ఓటీటీకి సెన్సార్ తీసుకురావాలని కోరుతున్నారు.

ఇప్పుడు సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టడంతో పలువురు ఎంపీలు ఓటీటీకి సెన్సార్ గురించి కూడా అడిగారు. దీనికి కేంద్రమంత్రి సమాధానమిస్తూ.. ఇటీవల ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఓటీటీలో కూడా ఎన్నో మంచి కంటెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మాత్రమే అలాంటి కంటెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగింది. ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పాను. ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ ని కంట్రోల్ గా టెలీకాస్ట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే సెన్సార్ కూడా తీసుకురావాల్సి వస్తుందని ఓటీటీ సంస్థలకు చెప్పినట్లు తెలిపారు.

Yamudu : నరలోకం వదిలి యముడు భూలోకానికి వస్తే.. అక్కడి శిక్షలు ఇక్కడ వేస్తే? యముడు గ్లింప్స్ రిలీజ్..

మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఓటీటీ సంస్థలు కంట్రోల్ లో ఉండి బోల్డ్ కంటెంట్ డెలివర్ చేయకుండా ఉంటారా? లేక పాత పద్ధతినే కొనసాగిస్తూ సెన్సార్ దాకా వెళ్తారా, ఒకవేళ ఓటీటీ సంస్థలు అలాంటి కంటెంట్ టెలికాస్ట్ చేసినా గవర్నమెంట్ సెన్సార్ విధిస్తుందా లేదా చూడాలి.