Sharathulu Varthisthai : ‘షరతులు వర్తిస్తాయి’ పెళ్లి సాంగ్ విన్నారా? ఇక నుంచి తెలంగాణ పెళ్లి వేడుకల్లో ఈ సాంగ్ వినపడాల్సిందే..
'షరతులు వర్తిస్తాయి' సినిమా నుంచి 'పన్నెండు గుంజల పందిర్ల కిందా ..' అని సాగే పెళ్లి లిరికల్ సాంగ్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Chaitanya Rao Sharathulu Varthisthai Movie Marriage Song Released by Director Sekhar Kammula
Sharathulu Varthisthai Song : చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి జంటగా నటించిన సినిమా ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టగా తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు.
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా నుంచి ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’ అని సాగే పెళ్లి లిరికల్ సాంగ్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) చేతుల మీదుగా రిలీజ్ చేశారు. హీరోని హీరోయిన్ పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అని అడిగటంతో ఈ సాంగ్ మొదలవుతుంది. తెలంగాణ పల్లెల్లో పాడే పాటల్లాగా దీన్ని రాశారు. మొదట పెళ్లి గురించి రాసి చివర్లో ఆడపిల్ల గురించి ఎమోషనల్ లిరిక్స్ రాశారు. ప్రస్తుతం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుంది. ఇక నుంచి తెలంగాణ పెళ్ళిళ్ళల్లో ఈ పాట కచ్చితంగా వినిపిస్తుంది. ఈ పెళ్లి సాంగ్ ని పెద్దింటి అశోక్ కుమార్ రాగా సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వంలో తెలంగాణ నేటివిటీ సింగర్స్ మొగుళ్ల శంకరమ్మ, శంకర్ బాబు, తేలు విజయ, వొల్లల వాణిలతో పాడించారు.
సాంగ్ లాంచ్ అనంతరం డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. డైరెక్టర్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. ఈ పాట వింటుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. నేను ఫిదా సినిమాలో వచ్చిండే పాట తీసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. పాటలతో పాటు ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని అన్నారు.
Also Read : Sohel : మోకాళ్ళ మీద కూర్చొని నా సినిమా చూడండి అంటూ ఏడ్చేసిన సోహెల్..
ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, హీరో చైతన్య రావు, డైరెక్టర్ కుమార స్వామి, రచయిత పెద్దింటి అశోక్ కుమార్.. పలువురు మూవీ యూనిట్ పాల్గొన్నారు.