Chalaki Chanti : హార్ట్ అటాక్‌తో హాస్పిటల్‌లో ఉంటే ఎవరూ హెల్ప్ చేయలేదు.. కోలుకున్నాక చంటి మొదటి ఇంటర్వ్యూ..
గత సంవత్సరం చలాకి చంటికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత చంటి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Chalaki Chanti Sensational Comments on Industry People after recovering from Health Issues
Chalaki Chanti : జబర్దస్త్ లో స్కిట్స్ తో టీమ్ లీడర్ గా చలాకి చంటిగా బాగా ఫేమస్ అయ్యాడు చంటి. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి చిన్న చిన్న క్యారెక్టర్స్ సినిమాల్లో చేస్తూ వచ్చినా రాని గుర్తింపు జబర్దస్త్ తో వచ్చింది. ఆ తర్వాత యాంకర్ గా మారి కూడా పలు షోలు చేసాడు. సినిమాల్లో కమెడియన్ గా చేసాడు. అయితే గత కొన్నాళ్లుగా చలాకి చంటి సినిమాల్లో, షోలలో కనపడట్లేదు.
గత సంవత్సరం చలాకి చంటికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడిన చంటి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత చంటి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు మాట్లాడాడు.
Also Read : Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
చలాకి చంటి మాట్లాడుతూ.. నేను హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో ఉంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఎవరూ పలకరించలేదు కనీసం. కొంతమంది మాత్రం ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారు అంతే. రియల్ లైఫ్ లో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాము. డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి హెల్ప్ చేయరు. ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారు అనుకుంటారు. కానీ మనకి ఎంతొస్తుంది అని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గరా హెల్ప్ ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో హెల్ప్ చేయరు అని తెలిపారు.
దీంతో చలాకి చంటి కష్టాల్లో ఉంటే ఎవరూ హెల్ప్ చేయలేదని బాగా బాధపడినట్టు తెలుస్తుంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కోలుకొని బయటకు రావడంతో చంటిని అభిమానించేవాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.