Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Naga Vamsi gives Clarity on Allu Arjun Next Movie after Pushpa 2

Updated On : October 14, 2024 / 8:29 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఉంటుందని ప్రకటించినా బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగ.. ఇలా పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేస్తాడు అని ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

నాగవంశీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే త్రివిక్రమ్ గారి తోనే ఉంటుంది. ఓ పాన్ ఇండియా సబ్జెక్టుని త్రివిక్రమ్ గారు తయారు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. చాలా పెద్ద కథ అది. ఓ జానర్ అని లేదు నేను ఇంకా త్రివిక్రమ్ గారిని కథ అడగలేదు, ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. భారీగానే పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పట్నించీ త్రివిక్రమ్ – బన్నీ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు.

Also Read : Naga Vamsi : టికెట్ రేట్లు చాలా చీప్ అంటూ నిర్మాత కామెంట్స్.. 250 రూపాయలే కదా..

త్రివిక్రమ్ – బన్నీ గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలతో వచ్చి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి రాబోతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి.