Naga Vamsi : టికెట్ రేట్లు చాలా చీప్ అంటూ నిర్మాత కామెంట్స్.. 250 రూపాయలే కదా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల గురించి ప్రస్తావన రాగా నాగవంశీ మాట్లాడుతూ..

Naga Vamsi : టికెట్ రేట్లు చాలా చీప్ అంటూ నిర్మాత కామెంట్స్.. 250 రూపాయలే కదా..

Producer Naga Vamsi Sensational Comments on Ticket Rates

Updated On : October 14, 2024 / 7:30 AM IST

Naga Vamsi : థియేటర్స్ కి జనాలు తగ్గడానికి, సినిమాలు ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి గత కొన్నాళ్లుగా మెయిన్ రీజన్ టికెట్ రేట్లు భారీగా పెరగడమే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు 100, 150 రూపాయల లోపు ఉన్న టికెట్ రేట్లు ఇప్పుడు 250 నుంచి 500 వరకు వెళ్లాయి. టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకుల దగ్గర్నుంచి సినీ నిర్మాతల వరకు కూడా విమర్శలు వచ్చాయి.

అయినా స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారు తప్ప తగ్గించట్లేదు. దీంతో మిడిల్ క్లాస్, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు థియేటర్స్ నుంచి దూరం అవుతున్నారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాల లాంగ్ రన్ కూడా తగ్గిపోతుందని సినీ ప్రముఖులే కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ టికెట్ రేట్లు ఏమి ఎక్కువ లేవు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నిర్మాత నాగవంశీ ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ దేవర సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

Also Read : Kirrak Seetha : బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సీత.. ఇప్పటికైనా రాత మారుతుందా..?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల గురించి ప్రస్తావన రాగా నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా టికెట్ రేట్లు ఇప్పటికి కూడా తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికీ తక్కువ రేటులో దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే. ఇప్పుడు దేవర సినిమా సింగిల్ థియేటర్స్ లో 250 రూపాయలు ఉంది టికెట్. ఫ్యామిలీ అంతా వచ్చి చూస్తే 1000 రూపాయలు, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి ఇంకో 500 వేసుకున్నా 1500 అవుతుంది. మూడు గంటల్లో 1500 రూపాయలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇండియాలోనే కాదు అమెరికాతో సహా ఎక్కడైనా తక్కువ రేట్ లో దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే అని అన్నారు.

దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు వాటిని ట్రోల్ చేస్తున్నారు. సింగిల్ థియేటర్ లోనే 1500 అయితే ఇక మల్టిప్లెక్స్ లలో ఇంకెంత ఖర్చు అవుతూందో, ఒక్క సినిమాకే 1500 అయితే ఇక వారానికి ఒక సినిమా అంటే నెలకి ఎంత అవుతుంది అని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో దిల్ రాజు లాంటి నిర్మాతలతో సహా అనేకమంది సినీ ప్రముఖులు టికెట్ రేట్ల వల్లే థియేటర్స్ కి జనాలు తగ్గారు అని చెప్పగా ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఇలా మాట్లాడటం గమనార్హం.