Kirrak Seetha : బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సీత.. ఇప్పటికైనా రాత మారుతుందా..?
సీతని ఎలిమినేట్ చేయడం ఏంటో అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

Kirrak Seetha Eliminated from Telugu Bigg Boss 8 Week 6
Kirrak Seetha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆరో వారంలో నిన్న కిరాక్ సీత ఎలిమినేట్ అయింది. హౌస్ లో సీత కంటే తక్కువ ఆడేవాళ్లు ఉన్నా సీతని ఎలిమినేట్ చేయడం ఏంటో అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. సీత ఎలిమినేట్ అవ్వడంతో లేడీ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక సీత మాట్లాడుతూ.. లైఫ్ లో చాలా కష్టాలు చూసాను. ఇదేమి పెద్ద కష్టం కాదు అని కామెంట్స్ చేసింది.
ఎప్పట్నుంచో సినీ పరిశ్రమలో నటిగా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి ఒక్కసారిగా వైరల్ అయింది. బేబీ సినిమా సీతకు మంచి పేరు, పాపులారిటీ తెచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయింది. అలా బేబీ సినిమాతో వచ్చిన గుర్తింపుతో సీత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.
Also See : Chiranjeevi – Nagarjuna : టాలీవుడ్ మెగాస్టార్, కింగ్ దసరా సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
అయితే బేబీ తర్వాత మళ్ళీ అంతగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ సీతకు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన జోష్ తో ఇప్పటికైనా సీత రాత మారి మరిన్ని అవకాశాలు సినిమాల్లో వస్తాయేమో చూడాలి. ఇక సీత ఎలిమినేట్ అయ్యాక.. నా లైఫ్ లో బిగ్గెస్ట్ మెమరీ బిగ్ బాస్ ద్వారా వచ్చింది. బిగ్ బాస్ జ్ఞాపకాలు నాకు ఎప్పటికి గుర్తుంటాయి. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.