Chalapathi Rao : చికన్ బిరియాని తిని.. అలా పడిపోయారు.. రవిబాబు!

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు 78 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన చలపతి 1200 పైగా సినిమాల్లో నటించారు. అయన మరణవార్త విన్న టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా అయన కుమారుడు రవిబాబు మీడియా ముందుకు వచ్చి.. చలపతి రావు మరణ విషయాన్ని వెల్లడించారు.

Chalapathi Rao : చికన్ బిరియాని తిని.. అలా పడిపోయారు.. రవిబాబు!

Chalapathi Rao son ravi babu to media

Updated On : December 25, 2022 / 2:21 PM IST

Chalapathi Rao : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు 78 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన చలపతి 1200 పైగా సినిమాల్లో నటించారు. అయన మరణవార్త విన్న టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా అయన కుమారుడు రవిబాబు మీడియా ముందుకు వచ్చి.. చలపతి రావు మరణ విషయాన్ని వెల్లడించారు.

Balayya – NTR : తమ కుటుంబసభ్యుడిని కోల్పోయాము అంటున్న బాలయ్య, ఎన్టీఆర్.. చలపతి మరణం!

“నిన్న సాయంత్రం సుమారు 8:30 గంటల సమయంలో మా నాన్నగారు కన్నుమూశారు. అయన లైఫ్ లో అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఉన్నారో. వెళ్లిపోవడం కూడా అలాగే వెళ్లిపోయారు. మాట్లాడుతూ, మాట్లాడుతూనే ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా కన్నుమూశారు. ఆయనకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యాని తిని, చేతిలోని ప్లేట్‌ని ఇచ్చి అలా వెన్నకి పడిపోయారు. అలా సింపుల్‌గా హ్యాపీగా వెళ్లిపోయారు అయన.

ఆయనకి జోక్స్, మంచి భోజనం, సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అలా దేవుడిలా భావించే ఎన్టీఆర్ తో అయన అనేక సినిమాల్లో నటించే అవకాశం కూడా కలిగింది. సినిమాలకి ఇక విరామం తీసుకుందాం అనుకున్న సమయంలో, మొన్ననే నేను తీస్తున్న కొత్త సినిమాలో ఒక పాత్ర కోసం అడిగితే నటించారు. అదే అయన చివరి సినిమా. అంత్యక్రియలు ఇవాలే నిర్వహిద్దాము అనుకున్నాము. కానీ నా సిస్టర్స్ అమెరికాలో ఉండడంతో బుధవారం చేయాల్సి వస్తుంది” అంటూ వెల్లడించాడు.