Chandra Mohan : హీరో నుంచి తండ్రి పాత్రలతో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. చంద్రమోహన్ సినీ ప్రస్థానం..

చంద్రమోహన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. గత జనరేషన్ కి హీరోగా ఎన్నో మంచి మంచి సినిమాలతో మెప్పించిన ఆయన ఈ జనరేషన్ లో తండ్రి పాత్రలతో మెప్పించి దగ్గరయ్యారు.

Chandra Mohan : హీరో నుంచి తండ్రి పాత్రలతో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. చంద్రమోహన్ సినీ ప్రస్థానం..

Chandra Mohan Passed Away Chandra Mohan Movies Career Full Details

Chandra Mohan Movie Career : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

చంద్రమోహన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. గత జనరేషన్ కి హీరోగా ఎన్నో మంచి మంచి సినిమాలతో మెప్పించిన ఆయన ఈ జనరేషన్ లో తండ్రి పాత్రలతో మెప్పించి దగ్గరయ్యారు. 1943 లో కృష్ణ జిల్లా పమిడిముక్కల గ్రామంలో పుట్టిన చంద్రమోహన్ అసలుపేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్లలో అగ్రికల్చరల్ డిగ్రీ చదివి ఆ తర్వాత తన బంధువు అయిన కళాతపస్వి, దర్శకులు K విశ్వనాధ్ సాయంతో సినీ పరిశ్రమలోకి వచ్చారు.

పలు సినిమాలలో సరదాకి చిన్న చిన్న పాత్రలు చేసి డైరెక్ట్ గా 1966లో హీరోగా రంగుల రత్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు చంద్రమోహన్. మొదటి సినిమాకే బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకొని అప్పట్లో అందరి దృష్టిలో పడ్డారు చంద్రమోహన్. అప్పట్నుంచి వరుసగా హీరోగా, సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత కమెడియన్ గా, సహాయ నటుడిగా కూడా అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్ రహీమ్‌, సుఖ దుఃఖాలు, సిరిసిరి మువ్వ, కురుక్షేత్రం, శంకరాభరణం చిత్రాలతో బాగా ఫేమస్‌ అయ్యారు.

Also Read : Chandra Mohan : ఒకప్పటి హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

హీరోగా సినిమా అవకాశాలు తగ్గాక సహాయ నటుడిగా, తండ్రి, మామ పాత్రల్లో వరుస సినిమాలు చేశారు. ఆదిత్య 369, పెద్దరికం, ఆమె, గులాబీ, నిన్నే పెళ్లాడతా, నువ్వు నాకు నచ్చవు, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే, 7G బృందావన కాలనీ, వర్షం, వసంతం, సంక్రాంతి, ఢీ, దేశముదురు.. ఇలా ఒకానొక సమయంలో ఫుల్ బిజీ ఉన్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిచారు. హీరో పాత్రల కంటే కూడా సహాయ నటుడిగానే ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ పాత్రలతో తన నటనతో మెప్పించారు. సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కి తండ్రి పాత్ర అంటే మొదట చంద్రమోహన్ గుర్తుకు వచ్చేలా సినిమాలు చేశారు.

చంద్రమోహన్ చివరగా 2017లో ఆక్సీజన్ సినిమాలో నటించారు. ఆ తర్వాత వయో భారంతో సినిమాలకు దూరమయినా అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో కనిపించారు. చాలా సినిమాల్లో నటించినా ఎక్కువ ఆస్తులు సంపాదించుకోలేకపోయానని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. డబ్బున్నవారికే ఎక్కువ విలువ ఉంటుందని, డబ్బుకి విలువ ఇవ్వాలని చెప్పేవారు.

గత కొన్నాళ్లుగా షుగర్‌, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటూ మరణించారు. చంద్ర మోహన్ 55 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 900 పైగా సినిమాలలో నటించారు.