Chandra Mohan : ఒకప్పటి హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

 హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. నేడు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు.

Chandra Mohan : ఒకప్పటి హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

Chandra Mohan Passed away with Health Issues at the age of 81 in Hyderabad

Updated On : November 11, 2023 / 10:45 AM IST

Chandra Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.

నేడు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

చంద్ర మోహన్ 81 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.