Chandrababu Naidu : అన్‌స్టాపబుల్‌లో జైలు జీవితం గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఏడ్చేసిన ఆడియన్స్.. ప్రోమో వైరల్..
ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Chandrababu Naidu Remembering Jail Days in Balakrishna Aha Unstoppable Show Promo Goes Viral
Chandrababu Naidu : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి మొదలు కానుంది. మొదటి ఎపిసోడ్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు వచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలోనే బోలెడన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు. పాలిటిక్స్, ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గురించి.. ఇలా అనేక అంశాలు మాట్లాడారు.
అయితే ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంఘటన గురించి కూడా బాలయ్య ప్రశ్నించారు. చంద్రబాబు తన జైలు జీవితం గుర్తుచేసుకొని.. మొదటి రాత్రి జైలులో ఎలా గడిపానో 53 రోజులు అలానే గడిపాను. నేను తప్పు చేసిన వాళ్ళని వదిలి పెట్టను, జైలు గోడలు మధ్య పవన్, నేను రెండు నిముషాలు మాట్లాడుకున్నాం. నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవడం ఒక హిస్టరికల్ డే అని తెలిపారు. అయితే మొత్తం ఏం మాట్లాడారో ప్రోమోలో రివీల్ చేయలేదు.
Also Read : లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ లపై అన్‌స్టాపబుల్‌లో బాలయ్య, చంద్రబాబు చర్చ?
అయితే చంద్రబాబు తన జైలు జీవితం గుర్తుచేసుకొని ఎమోషనల్ అవ్వడంతో షోకి వచ్చిన ఆడియన్స్ కూడా ఏడ్చేసారు. దీంతో చంద్రబాబు తన జైలు జీవితం గురించి పూర్తిగా ఏం మాట్లాడారో అని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 25న రాత్రి ఆహా ఓటీటీలో 8.30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా ప్రోమో చూసేయండి..