Pragathi : నా మెచ్యూరిటీ లెవెల్ కి తగ్గవాళ్ళు దొరకాలి కదా.. రెండో పెళ్లిపై ప్రగతి వ్యాఖ్యలు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రగతి రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ప్రగతి మాట్లాడుతూ.. ఇప్పుడు పెళ్లి అనే పదం కన్నా కంపానియన్ అనేది ముఖ్యం. తోడుండేవాడు ఉండాలి. చాలాసార్లు నాకు కూడా తోడు ఉండేవాడు ఉంటే బాగుండు................

Character artist Pragathi Comments on Second Marriage
Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఎన్నో సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క 46 ఏళ్ళ వయసులో కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇటీవల సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయింది ప్రగతి. తన జిమ్ ఫోటోలు, వీడియోలతో పాటలు డ్యాన్స్ లతో కూడా అదరగొడుతుంది. ప్రగతికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. చిన్న ఏజ్ లోనే పెళ్లిచేసుకున్న ప్రగతి ఆ తర్వాత తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తుంది. ప్రగతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Punarnavi Bhupalam : ఆ జబ్బుతో బాధపడుతున్నానంటూ.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రగతి రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ప్రగతి మాట్లాడుతూ.. ఇప్పుడు పెళ్లి అనే పదం కన్నా కంపానియన్ అనేది ముఖ్యం. తోడుండేవాడు ఉండాలి. చాలాసార్లు నాకు కూడా తోడు ఉండేవాడు ఉంటే బాగుండు అనిపించింది. కానీ నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యేవారు దొరకరు కదా అనిపిస్తుంది. నేను కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలని ఫిక్స్ అవుతాను. ఎవరికోసం వాటిని మార్చుకోలేను. ఒకవేళ 20 ఏళ్ళ వయసులో ఇలాంటి టాపిక్ వస్తే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేసేదాన్నేమో కానీ ఇప్పుడు చాలా కష్టం. ప్రస్తుతం నేను సినిమాలు, నా పిల్లలతో బిజీగా హ్యాపీగా ఉన్నాను అని తెలిపింది.