‘చెహరే’ పోస్ట్‌పోన్ – ఏప్రిల్ 24 విడుదల

అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, కృతి కర్భందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘చెహరే’ 2020 ఏప్రిల్ 24న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : November 9, 2019 / 07:24 AM IST
‘చెహరే’ పోస్ట్‌పోన్ – ఏప్రిల్ 24 విడుదల

Updated On : November 9, 2019 / 7:24 AM IST

అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, కృతి కర్భందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘చెహరే’ 2020 ఏప్రిల్ 24న విడుదల కానుంది..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘చెహరే’.. ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ అండ్ సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ (ప్రై.లి) సంయుక్తంగా నిర్మిస్తుండగా,  రూమీ జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, కృతి కర్భందా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి ఈ సినిమాకు సౌండ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

మిస్టరీ అండ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘చెహరే’ విడుదల వాయిదా పడింది. ముందుగా 2020 ఫిబ్రవరి 21న విడుదల చేయాలనుకున్నారు. శుక్రవారం కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. అమితాబ్, ఇమ్రాన్ కలిసి ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. గడ్డానికి పిలక వేసుకుని, ఊలు టోపితో ఉన్న అమితాబ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇమ్రాన్ కూడా గడ్డంతో కనిపించాడు..

Read Also : ‘సినిమా నా ఆశ, శ్వాస’ – మహేశ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

ఈ సినిమాలో14 నిమిషాల పాటు సాగే ఓ సీన్‌ను కేవలం సింగిల్ టేక్‌లో, ఒకే ఒక్క షాట్‌లో పూర్తి చేశారట అమితాబ్. ముందుగా అనుకున్నతేదీకి రెండు నెలలు ఆలస్యంగా 2020 ఏప్రిల్ 24న ‘చెహరే’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.