Chinna Jeeyar Swami : నిజమైన బాహుబలి రాముడు.. మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్‌కి రారు.. కానీ ఆదిపురుష్..
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సాధారణంగా మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి రారు. కానీ ఇక్కడ అందరిలో రాముడు ఉన్నారు. శ్రీమాన్ ప్రభాస్ రాముడిని అందరికి చూపిస్తున్నారు. నిజమైన బాహుబలి రాముడు...

Chinna Jeeyar Swami speech in Adipurush Pre Release Event
Adipurush : ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సాధారణంగా మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి రారు. కానీ ఇక్కడ అందరిలో రాముడు ఉన్నారు. శ్రీమాన్ ప్రభాస్ రాముడిని అందరికి చూపిస్తున్నారు. నిజమైన బాహుబలి రాముడు. రాముడు గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన ఈ నేలపై నడిచి పావనం చేసిన మనిషి. రామాయణంలో దేవతలంతా వచ్చి రాముడికి నువ్వు సాక్షాత్తు శ్రీనారాయణుడు, సీతా శ్రీ లక్ష్మి దేవి అని చెప్తే నేను మానవ మాత్రుడ్ని మాత్రమే అని అన్నారు. ఒక మనిషి సన్మార్గంలో నడిచి చూపించడానికి రాముడు మనిషి అయ్యాడు. ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనం దేవుళ్ళ వెనకాల పడక్కర్లేదు. మనం మంచి మనిషిగా ఉంటే దేవుళ్ళే మన వెనక వస్తారు. రాముడ్ని మనుషులంతా ప్రేమించారు. ఋషులు, దేవుళ్ళు, చెట్లు, పక్షులు, ప్రకృతి అంతా రాముడ్ని ప్రేమించారు. రాముడు మన అందరిలో ఉన్నాడు. కానీ ఎవరైనా ఆ రాముడ్ని పైకి తెచ్చేవాళ్ళు కావాలి. ఇవాళ ప్రభాస్ తనలో ఉన్న రాముడ్ని బయటకు తీసుకొస్తున్నారు అని అన్నారు.
అలాగే.. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండలో ఉన్న కథని చరిత్రకు అందించాలని ఆశతో సినిమా చేస్తున్నాము అని చెప్పారు. ఇంతకంటే లోకానికి మరో ఉపకారం ఉండదు. ఇలాంటి మంచి పనులు చేసే వీరికి ఇక్కడ ఏడుకొండలపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాను. ఇలాంటివి మరిన్ని లోకానికి అందించాలని, దీన్ని పైకి తెచ్చిన ఓం రౌత్ కు మరింత ఉత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈదేశపు యువతకు ఇలాంటి సినిమాలు అందించినందుకు ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉండాలి. గతంలో రామాయణంకు సంబంధించిన సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. కానీ ఈ తరానికి రామాయణం కావాలి. అందుకే ఇప్పటి టెక్నాలజీతో రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ టీంకి మా ఆశీర్వాదాలు. రాముడి గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి కార్యక్రమం ఉండదని వచ్చాను అని అన్నారు.