Chiranjeevi: తన వల్లే ఆ హీరో అలా అయ్యాడంటోన్న చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి తన తాజా మూవీ ‘గాడ్‌ఫాదర్’ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ రోల్ నటుడు సత్యదేవ్ చేశాడని.. అయితే ఆయనది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ఈ సినిమాలో ఉంటుందని మెగాస్టార్ తెలిపారు.

Chiranjeevi About Satyadev Role In Godfather
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తాజా మూవీ ‘గాడ్‌ఫాదర్’ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చి దిద్దామని చిరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది.
Godfather: సల్మాన్ నటించాడంటే, ఆ క్రెడిట్ అతడిదే అంటోన్న గాడ్‌ఫాదర్
గాడ్‌ఫాదర్ సినిమాలో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా అనిపించడంతో ఈ సినిమాను వెంటనే ఒప్పుకున్నట్లు చిరు తెలిపారు. అంతేగాక, ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ రోల్ నటుడు సత్యదేవ్ చేశాడని.. అయితే ఆయనది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ఈ సినిమాలో ఉంటుందని మెగాస్టార్ తెలిపారు. అయితే సత్యదేవ్‌ను ఈ సినిమాలో విలన్‌గా నటించాల్సిందిగా తానే కోరినట్లుగా చిరు పేర్కొన్నారు. గతంలో సత్యదేవ్ సినిమాలను తాను చూశానని.. ఆయన నటన అద్భుతంగా అనిపించడంతో ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో చేయాల్సిందిగా చిరు సత్యదేవ్‌ను ప్రత్యేకంగా కోరారట.
ఇక చిరు లాంటి స్టార్ హీరో తనను ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరడంతో సత్యదేవ్ వెంటనే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి సత్యదేవ్ నెగెటివ్ రోల్‌లో నటించేలా చేసి, గాడ్‌ఫాదర్ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌కు కారణం కూడా చిరుయే కావడంతో.. ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఎలా ఉండబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.