దొంగబాబాలపై సినిమా, చిరు కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 07:35 AM IST
దొంగబాబాలపై సినిమా, చిరు కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!

Updated On : September 1, 2020 / 8:55 AM IST

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల సందడి అంతా ఇంత ఉండదు. త్వరలోనే ఇది నిజం కాబోతోందని టాలీవుడ్ టాక్. చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథ రెడీ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది. సినిమా ఆసాంతం కామెడీతో ఉంటుందని, నకిలీ బాబాల ఆధారంగా సినిమా రూపొందించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.



ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌ – చిరు వేర్వేరు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. మాటల తూటాలు, అదే స్థాయిలో కామెడీ, ప్రేక్షకులను సీటుకే పరిమితం చేయడంలో త్రివిక్రమ్ దిట్ట. ఈ దర్శకుడితో తాను పని చేస్తానని గతంలో చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే.
https://10tv.in/ntr-30th-movie-update-soon/
కానీ..ఇతర కారణాలతో వీరి కాంబినేషన్ పట్టాలెక్కలేదు.
తాజాగా చిరుకు త్రివిక్రమ్ ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్, చిరు ఆచార్యా సినిమాలు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత..చిరు – త్రివిక్రమ్ కాంబినేషన్ ఉంటుందంటున్నారు.



చిరంజీవి, త్రివిక్రమ్ కలిసి గతంలో ‘జై చిరంజీవ’ సినిమాకు పని చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. మరి వీరి కాంబినేషన్ కుదురుతుందా ? లేదా ? అనేది చూడాలి.