Bholaa Shankar : రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా ట్రైలర్ ఉంది.

Bholaa Shankar : రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్..

Chiranjeevi Bholaa Shankar trailer released by Ram Charan

Updated On : July 27, 2023 / 5:06 PM IST

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) మరోసారి జంటగా కనిపిస్తూ చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతూనే, మరో పక్క ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఇక ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Samantha : 4 డిగ్రీల చల్లటి నీళ్లలో స్నానం చేస్తున్న సమంత.. హెల్త్ కోసమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. ట్రైలర్ ని యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా కట్ చేశారు. తమిళ్ హిట్ చిత్రం ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ అయిన చిరంజీవి, తన చెల్లిని తీసుకోని కోల్‌కత్తా వస్తాడు. అక్కడ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ గా జీవిస్తుంటాడు. అయితే తాను కోల్‌కత్తా వచ్చింది.. తన పెంచుకుంటున్న చెల్లి అమ్మానాన్నల చావుకి కారణమైన వారిని వెతుకుంటూ. ఈ క్రమంలో అమ్మాయిలని కిడ్నప్ చేసే మాఫియాతో చిరంజీవి ఫైట్ చేస్తాడు. ఈ కథని దర్శకుడు మెహర్ రమేష్ కామెడీ అండ్ కమర్షియల్ గా తెరకెక్కించాడు.

Spy Movie : ఏ ప్రకటన లేకుండా ఓటీటీకి వచ్చేసిన నిఖిల్ స్పై.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ తమన్నా.. “రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు” అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపించబోతుంది. ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.