Samantha : 4 డిగ్రీల చల్లటి నీళ్లలో స్నానం చేస్తున్న సమంత.. హెల్త్ కోసమేనా?

గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశ్శాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.

Samantha : 4 డిగ్రీల చల్లటి నీళ్లలో స్నానం చేస్తున్న సమంత.. హెల్త్ కోసమేనా?

Samantha Doing Ice Bath in Bali for Health

Updated On : July 27, 2023 / 11:49 AM IST

Samantha :  ఇటీవల సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన మయోసైటిస్ చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసమే సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని, అమెరికాకు వెళ్లి మయోసైటిస్ చికిత్స తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే సమంత ప్రస్తుతం మనశ్శాంతి కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ ప్రశాంతత కోసం ధ్యానం, పూజలు చేసిన సమంత ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తుంది.

గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశ్శాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్. బాలిలోని పలు దేవాలయాలని, ప్రకృతి ప్రదేశాలని సందర్శిస్తూ ఆ ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. ఇక అక్కడే సహజసిద్ధమైన చికిత్సలను కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రోజూ ఉదయం వ్యాయామాలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆ తర్వాత ప్రకృతిలో గడుపుతుంది.

Prabhas : మలయాళం స్టార్ హీరో దర్శకత్వంలో ప్రభాస్? ఇంకో సినిమా లైన్లో పెట్టాడా?

తాజాగా చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తున్న ఫోటోని షేర్ చేసింది సమంత. 4 డిగ్రీల చల్లటి నీళ్లలో ఆరు నిమిషాల పాటు స్నానం చేశానని నీళ్ళల్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సామ్. దానికి ఐస్ బాత్ అని పోస్ట్ చేసింది. అయితే ఇది కూడా ఆరోగ్యం కోసమే అంట. చల్లటి నీళ్ళల్లో చేస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తానికి సమంత ఆరోగ్యం, మనశ్శాంతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ దేశాలు తిరిగేస్తుంది.

 

Samantha Doing Ice Bath in Bali for Health in Bali