Chiranjeevi: ప్రయోగాలు చేయలేనంటున్న చిరు.. కారణమదేనా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మలయాళ మూవీ 'లూసిఫెర్'కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో..

Chiranjeevi Comments on Experimental Movies
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మలయాళ మూవీ ‘లూసిఫెర్’కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. తన స్టైలిష్ మేకింగ్ తో దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరుకెక్కించి ప్రేక్షకుల చేత వావ్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు.
Chiranjeevi : గరికపాటి వివాదంపై పెదవి విప్పిన చిరు
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అగ్ర హీరోలంతా రీమేక్ లు వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకిలా? స్టార్ హీరోస్ కి కథల కొరత కనిపిస్తుందా? అన్న ప్రశ్నించగా, చిరు బదులిస్తూ.. “ప్రేకక్షులు మా నుంచి ఒక తరహా కథలకు అలవాటు పడ్డారు. ఉదాహరణకి ‘ఠాగూర్’ మాతృకైనా ‘రమణ’ సినిమాలో హీరో చనిపోతాడు. కానీ ఇక్కడి ఆడియన్స్ దానిని అంగీకరించలేరు.
అలాగే మన సినిమా నిర్మాణం మరియు అమ్మకాలు పెద్ద ఎత్తున ఉంటాయి, మరి అదే స్థాయిలో వసూళ్లు రావాలంటే కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్లే ప్రయోగాలు చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అలాని ప్రయోగాత్మక సినిమాలు వద్దని కూడా అనుకోవడం లేదు. ప్లాప్ అయినా ఒక కోటి, కోటిన్నర నష్టంతో పొతే సమస్య ఉండదు. ఎందుకంటె దాని మీద ఆధారపడిన వారు ఎక్కువ.
కాబట్టి ప్రయోగాత్మక సినిమాలను మరియు ప్రేక్షకుడి అభిరుచికి తగట్టు సినిమాలను తెరకెక్కించాలంటే.. సేఫ్ బెట్ గా రీమేక్ లు వైపు చూడాల్సి వస్తుంది. అంతేగాని కథలు కొరత వల్ల కాదు” అంటూ వెల్లడించాడు.