Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లీడర్ మూవీ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని మెగాస్టార్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సక్సెస్‌ను అందించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.

Chiranjeevi Gang Leader Movie Re-Release Date Fixed
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని మెగాస్టార్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సక్సెస్‌ను అందించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.
Chiranjeevi : మరోసారి యంగ్ డైరెక్టర్స్ కి చిరంజీవి సలహాలు..
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ సినిమాలో చిరు నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, చిరంజీవి నటించిన ఓ వింటేజ్ బ్లాక్‌బస్టర్ మూవీని రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు రెడీ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలు జంటగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ మూవీని ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. విజయ్ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ సెన్సేషనల్ మూవీని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
దీంతో మరోసారి వింటేజ్ చిరంజీవిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు బప్పీ లహరి సంగీతం ఎలాంటి సక్సెస్‌ను అందజేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సత్యనారాయణ, శరత్ కుమార్, మురళీమోహన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి మెగాస్టార్ ‘గ్యాంగ్‌లీడర్’గా బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
#GangLeader is my fvt movie. I’ve been waiting for its Re-Release so long and the day has finally come ?
Will celebrate Vintage Megastar @KChiruTweets garu on FEB 11th just like on FDFS back in those days ? pic.twitter.com/AasqKABhuB
— Ajay Bhupathi (@DirAjayBhupathi) January 31, 2023