Unstoppable 3 : అన్‌స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్.. డేట్స్ కోసం చూస్తున్న..

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్‌ గెస్ట్‌లుగా రాబోతున్నారా..?

Unstoppable 3 : అన్‌స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్.. డేట్స్ కోసం చూస్తున్న..

Chiranjeevi KTR guests for Balakrishna Unstoppable 3 show

Updated On : September 19, 2023 / 6:51 PM IST

Unstoppable 3 : తెలుగు అతిపెద్ద ఓటీటీ ఆహాలో (Aha) ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ వచ్చిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. నందమూరి నటసింహ బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. ఓటీటీ రంగంలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇప్పటికే రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు రాగా.. ఒకటికి మించి మరో సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ షో మూడో సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’గా..

ఇక అలాగే ఈ మూడో సీజన్ లో గెస్ట్‌లుగా ఎవరు రాబోతున్నారు అంటూ ప్రతి ఒక్కరిలో ఎంతో ఆశక్తి నెలకుంది. సెకండ్ సీజన్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఫోన్ కాల్స్ ద్వారా షోలో ఆడియన్స్ ని అలరించాడు. దీంతో మూడో సీజన్ చరణ్ తోనే స్టార్ట్ అవుతుందని కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడు రెండు కొత్త పేరులు వినిపిస్తున్నాయి. బాలయ్య హోస్ట్ గా ఈ షో మొదలైన దగ్గర నుంచి.. ఈ ప్లాట్‌ఫార్మ్ పైకి చిరంజీవి (Chiranjeevi) ఎప్పుడు వస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Bollywood : బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకటే పోస్ట్.. ‘FARREY’ అంటే ఏంటి..?

బాలయ్య, చిరుని ఒకే స్టేజి పై చూడడానికి ఆడియన్స్ అంతా ఎంతో ఆశ పడుతున్నారు. ఇక మూడో సీజన్ చిరంజీవితో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ, చిరంజీవి డేట్స్ కోసం ఆహా టీం చూస్తుందని, కాల్ షీట్స్ సెట్ అవ్వగానే సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త. చిరంజీవితో పాటు కేటీఆర్ (KTR) పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. మరి వీరిలో ఎవరితో ఈ సీజన్ మొదలవుతుందో చూడాలి. కాగా మొదటి సీజన్ మోహన్ బాబుతో స్టార్ట్ అయ్యి మహేష్ బాబుతో ఎండ్ అయ్యింది. సెకండ్ సీజన్ చంద్రబాబు నాయుడుతో మొదలయ్యి పవన్ కళ్యాణ్ తో ఎండ్ అయ్యింది.