Mega 158: బెంగాల్ మాఫియా డాన్.. అండర్ వరల్డ్ లో ‘మెగా కదం’.. భారీ లెవల్లో సెటప్ చేస్తున్న బాబీ
ఫిబ్రవరి చివరి వారంలో మొదలుకానున్న చిరంజీవి- బాబీ కొల్లి మెగా 158(Mega 158) మూవీ రెగ్యులర్ షూటింగ్.
Chiranjeevi Mega 158 movie regular shoot starting from February.
- త్వరలోనే చిరు- బాబీ మూవీ షూటింగ్
- బెంగాల్ మాఫియా డాన్ గా మెగాస్టార్
- సరికొత్త అవతారంలో కనిపించనున్న చిరు
Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది. చాలా కాలం తరువాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం, కామెడీ టైమింగ్ తో అదరగొట్టేయడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇక అదే లెవల్లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది ఈ సినిమా. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడట మెగాస్టార్(Mega 158). అందుకోసం దర్శకుడు బాబీ కొల్లి చెప్పిన కథకు ఇప్పటికే ఒకే చెప్పేశాడు కూడా. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుందని సమాచారం.
Keerthy Suresh: భర్త, ఫ్యామిలీతో కలిసి కీర్తి సురేష్ సంక్రాంతి వేడుకలు.. ఫొటోలు వైరల్
అయితే, ఈ సినిమా కోసం బెంగాల్ బ్యాక్డ్రాప్ కథను సెట్ చేశాడట బాబీ. ఈ సినిమాలో మెగాస్టార్ బెంగాల్ మాఫియా డాన్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నాడట. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. మన శంకర వరప్రసాద్ సినిమా ప్రమోషన్స్ పూర్తవగానే రెండు వారాల పాటు చిరంజీవి రెస్ట్ తీసుకోనున్నారట. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట బాబీ.
దీంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. గతంలో చిరంజీవి- బాబీ కొల్లి కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు అలాంటి కాంబోలో మరో సినిమా వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
