Vishwambhara : మారేడుమిల్లి అడవుల్లో చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్.. సెట్స్ నుంచి ఫోటో లీక్..

మారేడుమిల్లి అడవుల్లో మొదలైన చిరంజీవి Mega156. 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ మూవీ షూటింగ్..

Vishwambhara : మారేడుమిల్లి అడవుల్లో చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్.. సెట్స్ నుంచి ఫోటో లీక్..

Chiranjeevi Mega156 Vishwambhara shooting held at maredumilli forest

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన 156 సినిమాని బింబిసారా దర్శకుడు వశిష్ఠతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఒక పేపర్ నెట్టింట లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ మొదలయింది. మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక పిక్ బయటకి వచ్చింది.

సోషియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కథ పంచభూతాలు చుట్టూ తిరగనుందట. ఈక్రమంలోనే ఈ సినిమాని అడవులు, నదులు, ప్రకృతి మధ్య తెరకెక్కించనున్నారు. దీంతో మొదటి షెడ్యూల్ ని మారేడుమిల్లి అడవుల్లో మొదలు పెట్టారు. మూవీ యూనిట్ అంతా మారేడుమిల్లిలో సినిమాని చిత్రీకరిస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి లేకుండానే ఈ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. నెక్స్ట్ వీక్ నుంచి చిరు ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారట.

Also read : Pushpa 2 : అన్‌స్టాపబుల్ షోలో పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన రణబీర్ కపూర్..!

ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాలో చిరు లుక్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకుంది. ఇండియన్ జోన్స్ మూవీలోని హీరోలా చిరు గెటప్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి వశిష్ఠ చిరు లుక్ ని ఎలా డిజైన్ చేశారో చూడాలి. కాగా ఈ మూవీకి చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్ రొమాన్స్ సన్నివేశాలు లేవని చెప్పినప్పటికీ.. ఫిమేల్ లీడ్ లో ఎవరు కనిపించబోతున్నారా..? అనేది ఆసక్తిగా మారింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నారట.