Chiranjeevi : తెలంగాణ డిప్యూటీ సీఎంని కలుసుకున్న చిరంజీవి దంపతులు..

తెలంగాణ కొత్త మంత్రులను ఒక్కొక్కరిగా కలుసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని సతీసమేతంగా కలుసుకున్నారు.

Chiranjeevi : తెలంగాణ డిప్యూటీ సీఎంని కలుసుకున్న చిరంజీవి దంపతులు..

Chiranjeevi met Bhatti Vikramarka Mallu along with his wife

Updated On : January 4, 2024 / 9:22 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ కొత్త మంత్రులను ఒక్కొక్కరిగా కలుసుకుంటూ వస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని కలుసుకున్నారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా భట్టి విక్రమార్కని కలుసుకున్నారు. నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో వీరు కలుసుకున్నారు.

చిరంజీవి దంపతులకు భట్టి విక్రమార్క పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇక చిరంజీవి కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో భట్టి విక్రమార్కని సత్కరించారు. అలాగే భట్టి విక్రమార్క కూడా చిరంజీవిని శాలువాతో సత్కరించారు. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య చిరంజీవి దంపతులకు ఆత్మీయ ఆతిథ్యం పలికారు.

Also read : Eagle : సంక్రాంతి నుంచి ‘ఈగల్’ అఫీషియల్‌గా అవుట్.. రిలీజ్ అప్పుడే.. టిల్లు 2, యాత్ర 2 కూడా వాయిదా..

డిప్యూటీ సీఎం కుటుంబంతో కలిసి చిరంజీవి దంపతులు కాసేపు మాటామంతి జరిపారు. ఇక పదవి చేపట్టినందుకు భట్టి విక్రమార్కకి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. సినిమా పరిశ్రమ విషయాలు కూడా వివరించి చర్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.