నవ్వుకే విషాదం : వేణుమాధవ్ మృతి తీరని లోటు – చిరంజీవి

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 07:56 AM IST
నవ్వుకే విషాదం : వేణుమాధవ్ మృతి తీరని లోటు – చిరంజీవి

Updated On : September 26, 2019 / 7:56 AM IST

నటుడు వేణు మాధవ్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం మౌలాలీలో ఆయన నివాసానికి వచ్చిన చిరంజీవి..వేణు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..చాలా దుర్దినం, మాస్టర్ సినిమా నుంచి తనతో ఎన్నో సినిమాలు చేసిన వేణు..ఇక లేడు అనేది జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.

భగవంతుడు అతనిపట్ల చిన్న చూపు చూసి..మా అందరికి దూరం చేసి..సినీ ఇండస్ట్రీకి..ముఖ్యంగా హాస్య కుటుంబానికి ద్రోహం చేస్తాడని అనుకోలేదన్నారు. నవ్వుకే విషాదం..వేణు..మల్టీటాలెంటెడ్ అని తెలిపారు. తమిళ నటుల్లో ఎంతో మంది హాస్య నటులున్నారని అనుకున్న క్రమంలో వేణు మాధవ్ సినీ ఇండస్ట్రీకి రావడం సంతోషం కలిగించిందన్నారు. కానీ అంతలోనే అతడు తమ మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(సెప్టెంబర్ 25,2019) మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం మౌలాలిలో అంత్యక్రియలు జరిగాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 600 సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో అగ్ర కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1996లో సినీ రంగ ప్రవేశం చేశారు. సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.