Chiranjeevi: తండ్రి సంవత్సరీకం సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, తాజాగా ఆయన తన తండ్రి వెంకట్రావు సంవత్సరీకం సందర్భంగా చిరు ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఎమోషనల్ చేశాడు.

Chiranjeevi Pays Tribute To His Father On Death Anniversary
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, తాజాగా ఆయన తన తండ్రి వెంకట్రావు సంవత్సరీకం సందర్భంగా చిరు ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఎమోషనల్ చేశాడు.
Chiranjeevi : సురేఖతో ఉప్పుచేప వండి పంపించమన్నారు.. కైకాల మరణంపై ఎమోషనల్ అయిన చిరంజీవి..
చిరంజీవి తండ్రిగారు వెంకట్రావు 2007, డిసెంబర్ 24న మరణించగా.. నేడు ఆయన సంవత్సరీకం నిర్వహించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా చిరు తన తండ్రిని తలుచుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అంతేగాక, తన తండ్రిని గుర్తుకు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్భంగా సర్మరించుకుంటూ..’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ తన తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. తమ కుటుంబం కోసం నిత్యం కష్టపడిన తన తండ్రి, తన ఎదుగుదలను చూసి మురిసిపోయేవారని.. ఆయన తమ మధ్యలో లేకపోయినా, ఆయన దీవెనలు తమవెంటే ఉంటాయని మెగాస్టార్ ఈ సందర్భంగా తెలిపారు.
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
అవగాహన పంచి,
మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన
మా తండ్రి వెంకట్రావు గారిని
ఆయన సంవత్సరీకం సందర్బంగా
స్మరించుకుంటూ .. pic.twitter.com/epHicHCxbc— Chiranjeevi Konidela (@KChiruTweets) December 24, 2022