Allu Cinemas: మామను మర్చిపోలేదు.. ‘అల్లు సినిమాస్’లో మెగాస్టార్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల్లు సినిమాస్(Allu Cinemas) మల్టీఫ్లేక్స్' ఈరోజు ఫార్మల్ గా ఓపెన్ అయ్యింది.

Allu Cinemas: మామను మర్చిపోలేదు.. ‘అల్లు సినిమాస్’లో మెగాస్టార్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్

Chiranjeevi photo special attraction at Allu Cinemas theater.

Updated On : January 4, 2026 / 10:15 AM IST
  • ‘అల్లు సినిమాస్’ పేరుతో అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్
  • జనవరి 4న ఫార్మల్ గా ఓపెన్
  • థియేటర్ లో మెగాస్టార్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్

Allu Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కోకాపేట లో ‘అల్లు సినీమాస్(Allu Cinemas)’ పేరుతో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మించాడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ పేరుమీద AAA ఉన్నప్పటికీ అది కెవాలం ఆసియన్ గ్రూప్స్ లో భాగస్వాయం మాత్రమే. కానీ, ఈసారి అల్లు అర్జున తన పేరునే బ్రాండ్ గా అల్లు సినిమాస్ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మిచాడు.

Dulquer Salmaan: హీరో కంటే గెస్ట్ రోల్స్ ఎక్కువయ్యాయి.. మరో తెలుగు సినిమాలో దుల్కర్.. తమిళోళ్ళకి పండగే!

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ మల్టీఫ్లెక్స్ త్వరలోనే ఓపెన్ కానుంది. ఇందులో భాగంగా, నేడు(జనవరి 4) ఈ థియేటర్ ని ఫార్మల్ గా ఓపెన్ చేశారు. అయితే, ఈ థియేటర్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు సినిమాస్ థియేటర్ లోపల అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ ఫొటోలతో పాటు మామ మెగాస్టార్ చిరంజీవి ఫోటోను కూడా ఏర్పాటు చేయించాడు.

దాంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ కి ఉన్న ఎమోషనల్ బాండింగ్ వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా గతం కొంత కాలంగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య విభేధాలవుం ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పడుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.