Dulquer Salmaan: హీరో కంటే గెస్ట్ రోల్స్ ఎక్కువయ్యాయి.. మరో తెలుగు సినిమాలో దుల్కర్.. తమిళోళ్ళకి పండగే!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) మరో తెలుగులో గెస్ట్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నాడు

Dulquer Salmaan: హీరో కంటే గెస్ట్ రోల్స్ ఎక్కువయ్యాయి.. మరో తెలుగు సినిమాలో దుల్కర్.. తమిళోళ్ళకి పండగే!

Dulquer Salmaan doing a guest role in Suriya 46 movie.

Updated On : January 4, 2026 / 9:21 AM IST
  • వెంకీ అట్లూరి- సూర్య మూవీ నుంచి క్రేజీ అప్డేట్
  • స్పెషల్ రోల్ చేస్తున్న దుల్కర్ సల్మాన్
  • తమిళ ఆడియన్స్ ఫుల్ హ్యాపీ

Dulquer Salmaan: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతీ భాషలో ఆయన్ని తమ సొంత హీరోలాగా ఫీలవుతూ ఉంటారు. ఓపక్క హీరోగా మెప్పిస్తునే మరో పక్క స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు దుల్కర్. ఇక తెలుగు గురించి ఎంత చెప్పినా తక్కువే. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో ఆయన ఎప్పుడు తెలుగు హీరోగా మారిపోయాడు.

ఇక స్పెషల్ రోల్స్ కూడా తెలుగులో ఎక్కువే చేశాడు దుల్కర్(Dulquer Salmaan). ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి, రీసెంట్ గా వచ్చిన ఛాంపియన్ సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేశాడు ఈ హీరో. ఇప్పుడు మరోసారి స్పెషల్ రోల్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు దుల్కర్. ఆ సినిమా మరేదో కాదు తమిళ స్టార్ సూర్య-వెంకీ అట్లూరి చేస్తున్న చేస్తున్న సినిమా. రిట్రో, కంగువ లాంటి వరుస ప్లాప్స్ తరువాత తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడు సూర్య.

Mana ShankaraVaraprasad garu: తిరుమలలో మన శంకరవరప్రసాద్ గారు చిత్ర యూనిట్.. ఫొటోలు

లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ రోల్ కోసం దర్శకుడు వెంకీ అట్లూరి దుల్కర్ ను అడిగాడట. తనకు లక్కీ భాస్కర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అడగడంతో వెంటనే ఓకే చెప్పేశాడట దుల్కర్.

దీంతో, చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారట. ఇక తమిళ ఆడియన్స్ సైతం సూర్య- దుల్కర్ కాంబోపై ఆసక్తికరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి కారణం, గతంలో దర్శకురాలు సుధ కొంగర తో ఈ ఇద్దరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ అయ్యింది. దీంతో, ఈ సినిమా విడుదల కోసం తమిళ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.