Tamannaah : తమన్నాని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటున్న చిరు.. వాళ్ళ నాన్నకు సర్జరీ జరిగినా..?

భోళాశంకర్ ప్రమోషన్స్ లో ఉన్న చిరంజీవి, తమన్నా గురించి మాట్లాడుతూ.. తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Tamannaah : తమన్నాని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటున్న చిరు.. వాళ్ళ నాన్నకు సర్జరీ జరిగినా..?

Chiranjeevi praises Tamannaah about her dedication in Bholaa Shankar

Updated On : August 6, 2023 / 7:46 PM IST

Tamannaah : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ భోళా శంకర్ (Bholaa Shankar). కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ సినిమాలో చిరుకి చెల్లిగా నటిస్తుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను యాంకరింగ్ లో చిరు, తమన్నా, కీర్తి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, తమన్నా గురించి మాట్లాడుతూ.. తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Chiranjeevi : చిరంజీవి, కీర్తి సురేష్ పీక ఎందుకు పట్టుకున్నాడో తెలుసా..? అలా చేయమని ఆర్డర్ వేయడంతో..

భోళా శంకర్ లో ‘మిల్కీబ్యూటీ’ అనే ఒక పాట ఉంది. ఈ సాంగ్ ని స్విజర్లాండ్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. దాదాపు రెండు వారాలు పాటు ఈ షూటింగ్ జరిగింది. అయితే ఈ షూటింగ్ సమయంలో తమన్నా వాళ్ళ నాన్నకి సర్జరీ అయ్యిందట. ఆ సమయంలో కూడా తమన్నా అక్కడికి వెళ్లకుండా.. యాక్షన్ అని చెప్పగానే కెమెరా ముందుకు వచ్చి అందంగా డాన్స్ వేయడం, కట్ చెప్పగానే కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్పేదట. తనకి ఎంత బాధ ఉన్నా దానిని అంతా దాచుకొని కెమెరా ముందుకు వచ్చి అందంగా డాన్స్ చేయడంలోనే తమన్నాకి సినిమా పై ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తుందని చిరు పేర్కొన్నాడు.

Chiranjeevi : గాడ్‌ఫాదర్ తరువాత రీమేక్స్ వద్దనుకున్నా.. కానీ భోళాశంకర్ నిర్మాత ఆ కారణం చెప్పి ఒప్పించాడు..

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ తమన్నా కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మిల్కీ బ్యూటీ సాంగ్ ని శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేయగా.. దానికి చిరు అండ్ తమన్నా గ్రేస్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. మహతి స్వర సాగర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది.