మీరెప్పుడూ తోడుంటారు.. థ్యాంక్యూ బ్రదర్ బాలయ్య..

  • Published By: sekhar ,Published On : April 3, 2020 / 10:20 AM IST
మీరెప్పుడూ తోడుంటారు.. థ్యాంక్యూ బ్రదర్ బాలయ్య..

Updated On : April 3, 2020 / 10:20 AM IST

క‌రోనా వైర‌స్ నివారణ కోసం మ‌న టాలీవుడ్ తార‌లంద‌రూ త‌మ‌వంతు సాయంగా అటు కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. తాజాగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాల‌కృష్ణ‌కు ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘‘ప్రియమైన సోదరుడు బాలకృష్ణ‌కు ధ‌న్య‌వాదాలు. ప్ర‌తి క‌ష్ట‌స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు.

Read Also : కరోనా సర్వనాశనం కోసం మన ఆయుధం సామాజిక దూరం..

సినీ కార్మికుల‌కు రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు విరాళం అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు’’ అంటూ బాలయ్యను అభినందించారు చిరంజీవి. సోష ల్ మీడియాలో బాలయ్య విరాళమందించిన వార్తతో పాటు చిరు ట్వీట్ కూడా వైరల్ అవుతోంది