నా పేరు విజయ్ : చిత్రలహరి టీజర్

  • Published By: madhu ,Published On : March 13, 2019 / 04:50 AM IST
నా పేరు విజయ్ : చిత్రలహరి టీజర్

Updated On : March 13, 2019 / 4:50 AM IST

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన సాయి ధరమ్ తేజ్ సొంత ఇమేజ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. స్టార్టింగ్‌లో మంచి పాత్రలు పోషించి మెగా అభిమాలను అలరించాడు. తర్వాత ఈ నటుడి చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దీనితో మంచి చిత్రం అందించాలనే తపనతో ఉన్నాడు. తాజాగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇతని పక్కన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
Read Also : RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

చిత్రలహరి..అప్పట్లో ఎవ్రీ ఫ్రైడే దూరదర్శన్‌లో వచ్చే ఓ ప్రోగ్రామ్. ఈ పేరిట సినిమా వస్తోంది. సాయి ధరమ్ తేజ్ డిఫెరెంట్‌ రోల్ పోషిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను మార్చి 13వ తేదీ ఉదయం 9గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తేజ్ పేర్కొన్నాడు. అనుకున్నట్లుగానే టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో చిత్రంలోని పాత్రలను ప్రేక్షకుల ముందుంచాడు.

‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడొస్తుందో..’ అంటూ డైలాగ్స్ పలికాడు సాయి ధరమ్ తేజ్. గుబురు గడ్డంతో వెరైటీగా కనిపించాడు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 12వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 
Read Also : ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం టీజర్.. తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’