Praveen Anumolu : టాలీవుడ్‌లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ మృతి!

టాలీవుడ్ లో వరుస మరణాలు ప్రతి ఒకర్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కె విశ్వనాథ్, నందమూరి తారకరత్న మరణాలు నుంచి తేరుకోక ముందే మరో మరణవార్త సినీ జనాలను కలిచి వేస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు..

Praveen Anumolu : టాలీవుడ్‌లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ మృతి!

Praveen Anumolu

Updated On : March 6, 2023 / 12:47 PM IST

Praveen Anumolu : టాలీవుడ్ లో వరుస మరణాలు ప్రతి ఒకర్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కె విశ్వనాథ్, నందమూరి తారకరత్న మరణాలు నుంచి తేరుకోక ముందే మరో మరణవార్త సినీ జనాలను కలిచి వేస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు నిన్న (మార్చి 5) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ప్రవీణ్ మరణించినట్లు తెలుస్తుంది. ప్రవీణ్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Kushi 2023 : రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఖుషీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

2017 లో సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ లో వచ్చిన దర్శకుడు సినిమాకు ప్రవీణ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ప్రవీణ్ అసిస్టెంట్ కెమెరా మ్యాన్ గా టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో పలు భారీ సినిమాలకు పని చేశాడు. ఈ క్రమంలోనే పంజా, యమదొంగ, ధూమ్ 3, బాజీరావు మస్తానీ, బేబీ సినిమాలకు అసిస్టెంట్ కెమెరా మ్యాన్ గా సేవలు అందించాడు. కాగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురై ప్రవీణ్ మరణించడంతో అయన కుటుంబ సభ్యులతో పాటు సినీ జనాలను కూడా తీవ్రంగా బాధిస్తుంది.

ఇటీవల మరణించిన తారకరత్న కూడా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒకరు హార్ట్ అట్టాక్ట్ గురవుతున్నారు.