The Kashmir Files : నిజాన్ని నిర్భయంగా చూపించిన సినిమా.. రోజురోజుకి పెరుగుతున్న వసూళ్లు

'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి రోజు చిన్న సినిమాగా దేశ వ్యాప్తంగా కేవలం 300 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే 4 కోట్ల....

The Kashmir Files : నిజాన్ని నిర్భయంగా చూపించిన సినిమా.. రోజురోజుకి పెరుగుతున్న వసూళ్లు

Kashmir Files

Updated On : March 14, 2022 / 9:58 AM IST

The Kashmir Files :  దేశ విభజన తర్వాత కశ్మీర్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్థాన్ కశ్మీర్ ని ఆక్రమించుకోడానికి చాలా ప్రయత్నించింది. కశ్మీర్ అంటే స్వతంత్రం ముందు ఒక అందమైన ప్రదేశం, హిందువులకు, వేద బ్రాహ్మణులకు నిలయం. కశ్మీర్ పండిట్లు అంటూ స్వర్గంలా విరాజిల్లుతూ ఉండేది. కానీ స్వతంత్రం అనంతరం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, ఉగ్రవాదుల వల్ల, పాకిస్థాన్ వల్ల కశ్మీర్ స్వరూపమే మారిపోయింది. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు, ఆడవారిని మానభంగాలు చేసారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చారు. ఇదంతా చరిత్ర. ఇన్ని రోజులు పాలించిన రాజకీయ నాయకులు కూడా ఈ చరిత్రని బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్ పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. తాజాగా కశ్మీర్ పండిట్లని అన్యాయంగా చంపేసిన చరిత్రని ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాగా తెరకెక్కించారు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ ని, నిర్మాతలని అనేకమంది బెదిరించారు. ఈ కథ బయటకి తెలిస్తే చంపేస్తామన్నారు. అయినా భయపడకుండా సినిమాని రిలీజ్ చేశారు. మొదటి రోజు చిన్న సినిమాగా దేశ వ్యాప్తంగా కేవలం 300 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే 4 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమాకి మరింత ఆదరణ పెరిగింది. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి మైసూర్ విశ్వ విద్యాలయం డాక్టరేట్

చరిత్రని నిర్భయంగా చెప్పడంతో ఈ నిజం నలుదిక్కులా వ్యాపించింది. సినిమాకి ఆదరణ పెరిగింది. దీంతో రెండో రోజు ఈ సినిమాకి దాదాపు 10 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల్లోనే సినిమా బాగా ప్రమోట్ అయింది పబ్లిక్ టాక్ తో. దీంతో సినిమా స్క్రీన్స్ కూడా దేశ వ్యాప్తంగా పెరిగాయి. మూడో రోజు కూడా వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నార్త్ లో ఈ సినిమా మరింత విజయం సాధించింది. ఈ సినిమాని చూసి కశ్మీర్ పండిట్లకు చెందిన కుటుంబాలు కంటతడి పెడుతున్నారు. డైరెక్టర్ ని అభినందిస్తున్నారు.

Nag Ashwin : హాలీవుడ్‌ని ఢీ కొడతావ్.. నాగ్ అశ్విన్‌కి ఆనంద్‌ మహీంద్రా ప్రశంశలు

ఇక 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి నాలుగు రాష్ట్రాల్లో ట్యాక్ ఫ్రీ కూడా కల్పించడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఒక చిన్న సినిమాగా, ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబడుతుంది ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా. మరో పది రోజుల వరకు ఏ సినిమా లేకపోవడంతో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.