కోలుకుంటున్న హాస్య నటుడు బ్రహ్మానందం 

ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోలుకుంటున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 11:07 AM IST
కోలుకుంటున్న హాస్య నటుడు బ్రహ్మానందం 

Updated On : January 17, 2019 / 11:07 AM IST

ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోలుకుంటున్నారు.

ముంబై : ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోలుకుంటున్నారు. అనారోగ్యంతో ఆయన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. జనవరి 14న బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటన చేశారు.

బ్రహ్మానందానికి హార్ట్ సర్జరీ జరిగినట్లు ఆయన కుమారుడు గౌతమ్ తెలిపారు. ’నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతోంది. నాన్నగారు కోలుకుంటున్నారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు మార్చారు. అభిమానులు ఆందోళన చెందవద్దు అన్నారు అని గౌతమ్ తెలిపారు.