Comedian Bablu : కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా? త్వరలో పెళ్లి.. ఎలాంటి పరిస్థితుల నుంచి….

చిత్రం, ఆర్య సినిమాలు చూసిన వారు కమెడియన్ బబ్లూని మర్చిపోరు. సడెన్ గా కనిపించకుండా పోయిన బబ్లూ రీసెంట్‌గా కొన్ని ఇంటిర్వ్యూల్లో కనిపించారు. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Comedian Bablu : కమెడియన్  బబ్లూ గుర్తున్నాడా? త్వరలో పెళ్లి.. ఎలాంటి పరిస్థితుల నుంచి….

Comedian Bablu

Updated On : September 22, 2023 / 4:56 PM IST

Comedian Bablu : కమెడియన్ బబ్లూ అటు బుల్లితెర, ఇటు సిల్వర్ స్క్రీన్‌పై పేరు తెచ్చుకున్న నటుడు. చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లోనే నటించారు. కొంతకాలంగా బబ్లూ ఎక్కడ కనిపించలేదు. రీసెంట్‌గా ఇంటర్వ్యూలు ఇస్తూ అందరికీ కనిపించారు. అసలు ఇన్ని రోజులు బబ్లూ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు షారుఖ్ ఖాన్‌కి చూపించాను.. అట్లీ కామెంట్స్

బబ్లూ అసలు పేరు సదానంద్. తనకి బబ్లూ అని పేరు పెట్టింది జంధ్యాల గారట. 5 ఏళ్ల వయసులో ‘ముద్దుల మేనల్లుడు’ సినిమాలో నటించిన బబ్లూ 11వ ఏట సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. ‘చిత్రం’ సినిమా చేస్తున్నప్పుడు ఆయన 10వ తరగతి చదువుతున్నారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో బబ్లూకి అవకాశాలు వచ్చాయి. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన బబ్లూ సడెన్‌గా సినిమాకు దూరమయ్యారు. రీసెంట్‌గా తన రీఎంట్రీ గురించి అనౌన్స్ చేస్తూ బబ్లూ కొన్ని ఇంటర్వ్యూల్లో కనిపించారు.

కొన్ని సంవత్సరాలుగా వెండితెరకు దూరమైన బబ్లూ జీవితంలో అనుకోని విషాదాలు తనని డిప్రెషన్ లోకి నెట్టేసాయట. 2012 లో తండ్రి మరణం, 2022 లో అనారోగ్యంతో చెల్లెలు చనిపోవడం.. ఈ ఏడాది జనవరిలో తన మేనత్త కొడుకు చనిపోవడంతో చాలారోజులు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయానని బబ్లూ చెప్పారు. ఆ సమయంలోనే బ్యాంకాక్ వెళ్లినట్లు అక్కడ డీజేగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తను ఓ ఫిల్మ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాని.. త్వరలోనే తన సొంత ప్రాజెక్టుతో పాటు కొన్ని ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నానని బబ్లూ చెప్పారు.

Leo Movie : క్యాప్షన్స్‌తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..

బబ్లూ వ్యక్తిగత జీవితానికి వస్తే త్వరలో బబ్లూ ఓ ఇంటివాడు కాబోతున్ననని చెప్పారు. కరోనా లాక్ డౌన్‌లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన తెలుగు అమ్మాయిని ప్రేమించానని ఇంట్లో వరుస విషాదాల కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నానని బబ్లూ చెప్పారు.