Commitment : ‘కమిట్‌మెంట్’ అంటూ కవ్విస్తున్న తేజస్వి..

Commitment : ‘కమిట్‌మెంట్’ అంటూ కవ్విస్తున్న తేజస్వి..

Updated On : June 12, 2021 / 4:24 PM IST

Commitment: తేజస్వి మదివాడ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, లవర్స్, ఐస్‌క్రీమ్, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకో ఈ తెలుగమ్మాయి కెరీర్ అనుకున్నంతగా.. ఆశించినంతగా సాగలేదు.


ఈ ముద్దుగుమ్మ కొంత గ్యాప్ తర్వాత ‘కమిట్‌మెంట్’ అనే సినిమాతో రాబోతోంది. నవంబర్ 18న టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.


హాట్ అండ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ.. ‘‘అందరూ లాక్‌డౌన్‌లో చాలా బోర్ అయ్యారా.. మీ బోర్‌డమ్‌కి నవంబర్ 18న ఒక క్రేజీ రిలీఫ్ రాబోతుంది.. ‘కమిట్‌మెంట్’ టీజర్ రిలీజ్ అవుతోంది.. డోంట్ మిస్ ఇట్’’.. అంటూ అప్‌డేట్ ఇచ్చింది తేజస్వి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)