Committee Kurrollu : అయ్య బాబోయ్.. ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ చూసారా..
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు.

Committee Kurrollu collections after two weeks
Committee Kurrollu collections : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి పతాకంపై నిర్మించిన ఈ మూవీ ద్వారా యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో సీనియర్ నటీనటులతో పాటు డజను మంది కొత్తవాళ్లు కూడా నటించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.
Movie Artists Association : ప్రభాస్‌పై కామెంట్స్.. స్పందించిన ‘మా’.. ఘాటు లేఖ
రెండు వారాల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15.6 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ లు ఆశించిన స్థాయిలో అలరించకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి వస్తోంది. ఆగస్టు 29 న ‘సరిపోదా శనివారం’ వచ్చేవరకు కూడా ఈ సినిమా కలెక్షన్లకు దాదాపుగా ఎటువంటి ఢోకా ఉండే అవకాశం లేదు. ఈ లెక్కన కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ వద్ద బాగానే సంపాదించే అవకాశం ఉంది.
Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. పవర్ స్టార్‌ను కలిసిన నిర్మాత