Movie Artists Association : ప్రభాస్‌పై కామెంట్స్‌.. స్పందించిన ‘మా’.. ఘాటు లేఖ‌

బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై చేసిన కామెంట్ల పై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు.

Movie Artists Association : ప్రభాస్‌పై కామెంట్స్‌.. స్పందించిన ‘మా’.. ఘాటు లేఖ‌

MAA President Manchu Vishnu respond on Arshad Warsi Joker Comments

Updated On : August 23, 2024 / 1:04 PM IST

బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై చేసిన కామెంట్ల పై ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు. అర్ష‌ద్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నాడు. ఈ మేర‌కు సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ (CINETAA)కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ త‌రుపున‌ లేఖ రాశాడు విష్ణు.

ప్ర‌తి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందన్నారు. దాన్ని తాము గౌరవిస్తామ‌న్నారు. అయితే.. ప్ర‌భాస్‌ను అర్ష‌ద్ త‌క్కువ‌గా చేసినందుకు విచారిస్తున్నాం. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీశాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారి తీస్తోంద‌ని, కాబట్టి భావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యమ‌న్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని అర్షద్ వార్సీని కోరుతున్నాము. ఈ విష‌యంలో మీ మ‌ద్ద‌తును కోరుతున్నామ‌ని లేఖ‌లో సేర్కొన్నారు.

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అప్‌డేట్‌.. ప‌వ‌ర్ స్టార్‌ను క‌లిసిన నిర్మాత‌

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తూ కల్కి సినిమాలో జోకర్ లాగా కనిపించాడని అన్నారు. అర్షద్ వార్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ని జోకర్ అని అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ న‌టులు సైతం అర్షద్ పై మండిప‌డుతున్నారు.

అర్ష‌ద్ ఏం అన్నాడంటే..?
‘కల్కి మూవీ చూశా.. అయితే ఈ మూవీ నాకు న‌చ్చ‌లేదు. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్ మాత్రం అశ్వ‌త్థామ‌గా అద‌ర‌గొట్టాడు. ఈ వ‌య‌సులో ఆయ‌న ఇలా న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం. ఆయ‌న‌కు ఉన్న శ‌క్తిలో నాకు కొంచెం అయిన ఉండి ఉంటే ఈ పాటికే లైఫ్ సెట్ అయిపోయేది. ఇక మూవీలో ప్ర‌భాస్ పోషించిన పాత్ర బాగాలేదు. ఆయ‌న పాత్ర ఓ జోక‌ర్‌లా ఉంది. ప్ర‌భాస్‌ను తాను మ్యాడ్ మాక్స్ లాంటి మూవీలోని మెల్ గిబ్బ‌న్‌లా చూడాల‌నుకు న్నాను.’ అని అర్ష‌ద్ వార్సీ అన్నారు.

Mirai : తేజ సజ్జ బ‌ర్త్‌డే.. ‘మిరాజ్’ నుంచి సూప‌ర్ అప్‌డేట్..