Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అప్‌డేట్‌.. ప‌వ‌ర్ స్టార్‌ను క‌లిసిన నిర్మాత‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’.

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అప్‌డేట్‌.. ప‌వ‌ర్ స్టార్‌ను క‌లిసిన నిర్మాత‌

Hari Hara Veera Mallu producer meets Pawan Kalyan

Updated On : August 23, 2024 / 12:00 PM IST

Pawan Kalyan – Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డగా.. ఆగ‌స్టు 14 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

ఎన్నిక‌లు, రాజ‌కీయాల‌తో ప‌వ‌న్ బిజీగా ఉండ‌డంతో కొంత‌కాలంగా సినిమా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ద‌ర్శ‌కుడు, నిర్మాత లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

Mirai : తేజ సజ్జ బ‌ర్త్‌డే.. ‘మిరాజ్’ నుంచి సూప‌ర్ అప్‌డేట్..

‘‘ది లెజండరీ, మోస్ట్‌ వాంటెడ్‌ పోరాటయోధుడు హరిహరవీరమల్లు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. తన అన్వేషణను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరెన్నో ఆసక్తికర అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి’’ అని తెలిపింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు పుల్ ఖుషి అవుతున్నారు.

ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 17వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగాన్ని స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. ధ‌ర్మం కోసం యుద్ధం అనేది ఉప‌శీర్షిక‌.

Megha Akash : కుర్రాళ్ల‌కు షాక్‌.. ప్రియుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైర‌ల్