Dasara Movies : ‘దసరా’కు సినిమా రిలీజ్ లు గట్టిగానే ఉన్నాయిగా.. మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అంటే..

దసరాకు ఈ సారి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

Dasara Movies : ‘దసరా’కు సినిమా రిలీజ్ లు గట్టిగానే ఉన్నాయిగా.. మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అంటే..

Competition between Dasara Movies Full Details Here

Updated On : October 7, 2024 / 2:40 PM IST

Dasara Movies : దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాలు అదే సమయంలో రావాలి అనే సెంటిమెంట్ పోయి ఎక్కువ హాలిడేస్ ఉన్న రోజులను చూసుకుంటున్నారు. దీంతో పండగలకు చిన్న, మీడియం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి దసరాకు స్టార్ హీరోల సినిమా ఒక్కటే ఉన్నా మిగిలిన చిన్న, మీడియం సినిమాలతో పోటీ ఎక్కువే ఉంది.

ఆల్రెడీ దసరా హాలిడేస్ నడుస్తున్నాయి. దసరా హాలిడేస్ మొదలవ్వగానే ఇటీవలే శ్రీవిష్ణు స్వాగ్ సినిమాతో వచ్చాడు. ఇక అసలు దసరాకు ఈ సారి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. దసరా 12వ తేదీ కావడంతో రెండు రోజుల ముందు నుంచే సినిమాల పండగ మొదలవుతుంది.

Also Read : Sudheer Babu – Mahesh Babu : మొదటి సారి మహేష్ బాబు అంతలా రియాక్ట్ అయ్యాడు.. సుధీర్ బాబు కామెంట్స్..

అక్టోబర్ 10న రజినీకాంత్ ‘వెట్టయాన్’ డబ్బింగ్ సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో రజినీకాంత్ కి మంచి ఫాలోయింగే ఉంది, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాగానే వర్కౌట్ అవ్వొచ్చు తెలుగులో.

ఇక అక్టోబర్ 11న మూడు డైరెక్ట్ తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సుహాస్ ‘జనక అయితే గనక’ అనే ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాతో అక్టోబర్ 11న రాబోతున్నాడు.

శ్రీనువైట్ల చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం చేస్తూ గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ అనే సినిమాతో రాబోతున్నాడు. కామెడీ యాక్షన్ గా ఈ సినిమా రాబోతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఉంది. మరి పండక్కి థియేటర్స్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సుధీర్ బాబు హీరోగా నాన్న ఎమోషన్ తో ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక మంచి ఎమోషనల్ సినిమాలా మెప్పించొచ్చు అని తెలుస్తుంది.

అలాగే బాలీవుడ్ లో అలియాభట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘జిగ్రా’ అక్టోబర్ 11న తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ కానుంది.

ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన కన్నడ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా ‘మార్టిన్’ కూడా తెలుగులో అక్టోబర్ 11న డబ్బింగ్ అయి రిలీజ్ కాబోతుంది.

మరి ఈ అరడజను సినిమాల్లో దసరా విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.