న్యూ ఇయర్ రోజున నాని జెర్సీ ఫస్ట్ లుక్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ..

నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ..
నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ.. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో, నాని సరసన శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న జెర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.
2019 జనవరి 1న జెర్సీ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. నానికిప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. న్యూ ఇయర్ రోజున జెర్సీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుండడంతో 2019 తనకి కలిసొస్తుందని భావిస్తున్నాడు న్యాచురల్ స్టార్. జెర్సీలో నాని తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. సత్యరాజ్, బ్రహ్మీజీ కీలక పాత్రలు పోషించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.. 2019 ఏప్రిల్ 19న జెర్సీ రిలీజ్ కానుంది.