Bollywood : బాలీవుడ్ కి ఏమైంది..? వరుస బెదిరింపులు.. భయం గుప్పిట్లో సెలబ్రిటీలు..
మళ్ళీ బాలీవుడ్ కి వరుస బెదిరింపులు వస్తున్నాయి. (Bollywood)
Bollywood
Bollywood : కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ కి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చేవి అని వార్తలు వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ కి వరుస బెదిరింపులు వస్తున్నాయి. మొన్నటి దాకా సల్మాన్ ఖాన్ ఒక్కడికే చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ బెదిరించేది. కానీ ఇప్పుడు వరుసగా దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ కి బెదిరింపులు వస్తున్నాయి.(Bollywood)
గత వారం రోజుల గ్యాప్ లోనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, సల్మాన్ ఖాన్ బామ్మర్ది ఆయుష్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా వీళ్ళని బెదిరిస్తున్నారు. ఇందులో కొంతమంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనే చెప్తున్నారు. కొంతమందికి అజ్ఞాత వ్యక్తుల నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే వీటిపై విచారణ చేస్తున్నారు.
Also Read : Star Actor : నటరాజ స్వామిగా మారిన స్టార్ నటుడు.. ఒళ్ళంతా రంగు పూసుకొని.. ఎవరో గుర్తుపట్టారా?
తాజాగా ఓ హీరోయిన్ కి బెదిరింపులు వచ్చాయి. నటి, సింగర్ హిమాన్షీ ఖురానాని 10 కోట్లు ఇవ్వాలంటూ ఓ దుండగుడు ఈమెయిల్ ద్వారా వాయిస్ నాట్ పంపించాడు. లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టాడు. దీంతో హిమన్షి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఈమెయిల్ తో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇలా వరుసగా రోజూ బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు వస్తుండటంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు పోలీసులు వాళ్లకు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్టార్ హీరోలకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇలా వరుస బెదిరింపులు రావడంతో మిగతా వాళ్ళు భయపడుతున్నారు. ఇదంతా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తుందా లేదా ఇంకెవరైనా చేస్తున్నారా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత ఇలా బాలీవుడ్ స్టార్స్ కి బెదిరింపులు వస్తుండటంతో అంతా భయపడుతున్నారు.
Also See : Aditi Bhavaraju : ఫంకీ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన సింగర్..
