Bheemla Nayak Song : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ పాటపై వివాదం

పవన్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ మూవీ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Bheemla Nayak Song : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ పాటపై వివాదం

Bheemla Nayak (1)

Updated On : September 3, 2021 / 2:36 PM IST

Bheemla Nayak song : పవన్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ మూవీ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పదాలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటూ హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌ ట్వీట్ చేశారు. పవన్ బర్త్‌ డే సందర్భంగా ఇవాళ ఉదయం సాంగ్‌ను రిలీజ్ చేయగా.. రికార్డ్ స్థాయిలో సుమారు 55 లక్షలకు చేరువలో వ్యూస్‌లు వచ్చాయి. అయితే పోలీసులను కించపరిచేలా కొన్ని పదాలను వాడారాన్నది పోలీసుల అభ్యంతరం.

‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’.. గురువారం ఉదయం నుంచి మీడియా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాట మొదట్లో సాకి పాడిన వ్యక్తి ఎవరబ్బా.. ఇంతకుముందు ఏవైనా సినిమాల్లో పాడారా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.