Arjun Kapoor: బాలీవుడ్‌లో కరోనా కలకలం.. అర్జున్ కపూర్‌కు పాజిటివ్!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా కపూర్ కు కరోనా సోకి కోలుకోగా ఇప్పుడు..

Arjun Kapoor: బాలీవుడ్‌లో కరోనా కలకలం.. అర్జున్ కపూర్‌కు పాజిటివ్!

Arjun Kapoor

Updated On : December 29, 2021 / 9:30 PM IST

Arjun Kapoor: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా కపూర్ కు కరోనా సోకి కోలుకోగా ఇప్పుడు బోణీ కపూర్ వారసులకు కరోనా సోకింది. అర్జున్ కపూర్, అయన సోదరి సోదరి అన్షులా కపూర్‌కు డిసెంబర్ 29న మహ్మమారి సోకినట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు.

Khiladi: మాస్ రాజా మొదలెట్టేశాడు.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

అర్జున్ కపూర్ గత ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా కరోనా బారిన పడ్డగా ఇది రెండవసారి. కాగా, ఇప్పుడు అర్జున్ కపూర్‌ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్‌ పరీక్షలలో నెగెటివ్‌ వచ్చింది. ఈ మధ్యనే అర్జున్-మలైకా ఓ డిన్నర్‌ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. అలాగే రియా కపూర్‌, తన భర్త కరణ్‌ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీ ద్వారా షేర్‌ చేసింది.

Sai Pallavi: బుర్ఖా ధరించి ప్రేక్షకుల మధ్య సినిమా చూసిన హీరోయిన్!

అర్జున్‌ కపూర్‌ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్‌ చేస్తుంది బీఎంసీ. అర్జున్ కపూర్ ఇంట్లో ఒకేసారి నలుగురికి కరోనా సోకడం.. మరోవైపు బాలీవుడ్ లో కరోనా మహమ్మారి విజృంభణతో బీటౌన్ హడలెత్తిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)