సినీ నటుడు రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

సినీ నటుడు రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

Updated On : December 29, 2020 / 8:58 AM IST

Corona virus positive for hero Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు లేవని..ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.

కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చరణ్ తెలిపారు. త్వరలో కోలుకుని శక్తివంతంగా మీ ముందుకు వస్తానని చరణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇంట్లోలోనే క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజు అనే పాత్రంలో రామ్ చరణ్ కనిపించనున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందనుకున్న క్రమంలో రామ్ చరణ్ కు కరోనా సోకడం చిత్ర బృందాన్ని ఆందోళన కలిగిస్తోంది.