హీరో నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన సీపీఐ నేత నారాయణ

హీరో నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన సీపీఐ నేత నారాయణ

Updated On : December 27, 2020 / 5:07 PM IST

CPI leader Narayana serious allegations against Hero Nagarjuna : ప్రముఖ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కేసు వేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బిగ్ బాస్ షో లో నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నారాయణ ఆరోపించారు. ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఎవరిని కిస్ చేస్తావు.. ఎవరితో డేటింగ్ చేస్తావు… ఎవరిని పెళ్లి చేసుకుంటావంటూ ఒక యువకుడిని ప్రశ్నించడం చాలా దారుణమన్నారు. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు.

అక్కినేని నాగార్జున అంటే తనకు అభిమానం, ఆయన సినిమాలు చూస్తా కానీ ఆయన ఎంత దరిద్రం పని చేశారని మండిపడ్డారు. మహిళా లోకానికి నాగార్జున అన్యాయం చేశారని తెలిపారు. బిగ్ బాస్ షోలో బహిరంగంగా మహిళలను కించే పరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. నాగార్జున ఇంట్లో కూడా సినిమా యాక్టర్స్ ఉన్నారు..మరి వాళ్ల బొమ్మలు పెట్టొచ్చుగా ఎందుకని అమాయకుల బొమ్మలు పెట్టారని ప్రశ్నించారు.

ఈ పద్ధతిలో సినిమా యాక్టర్లకు వచ్చే పేరును మహిళా లోకానికి అన్యాయం చేస్తుంటే పోలీసు స్టేషన్ వెళ్లి కేసు పెడితే తీసుకోలేదన్నారు. స్థానిక కోర్టు, జిల్లా కోర్టులో కేసు వేస్తే తీసుకోలేదని..ఇప్పుడు హైకోర్టులో కేసు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనపై కేసులు తీసుకోవడానికి కోర్టులు భయపడుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాతృభూమిలో మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా అని నిలదీశారు. మహిళలను అన్యాయం చేసి మాట్లాడుతుంటే నాగార్జునకు ఎన్ని కోట్లు రావొచ్చన్నారు.